రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువ ఇంజనీర్లు మృతి

SMTV Desk 2018-01-28 15:09:14  accident, rajamundry chevella, 3 members facebook softwares, pass away.

చేవెళ్ల, జనవరి 28 : రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందగా.. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాథమిక సమాచారం మేరకు.. వీరంతా హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌ వెళ్తుండగా.. చేవెళ్ల మండలం హైదరాబాద్, బీజాపూర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్న కాచిగూడకు చెందిన ప్రవీణ్‌(24), మహబూబ్‌నగర్‌కు చెందిన డేవిడ్‌(25), అర్జున్‌(24) (ఇతని స్వస్థలం గుర్తించాల్సి ఉంది) లుగా పోలీసులు గుర్తించారు. అలాగే గాయపడిన శ్రావణ్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతులను శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.