కాంగ్రెస్‌ "కాళేశ్వరం"లో కొట్టుకుపోవటం ఖాయం : హరీష్

SMTV Desk 2018-01-28 14:38:20  Irrigation Minister, Harish rao, Comments on congress.

హైదరాబాద్, జనవరి 28 : ప్రతిపక్షాలు ప్రాజెక్టులు కట్టాలని కోరాలి కానీ.. తెలంగాణలో ప్రతిపక్షాలు మాత్రం ప్రాజెక్టులు ఆపమంటున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళల్లో కొట్టుకుపోవడం ఖాయమన్నారు. ఎవరైనా ఈ ప్రాజెక్టును చూసి అభినంది౦చాల్సిందేనని, అలాగే ప్రాజెక్టు చూసేందుకు అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తామన్నారు.