సూర్యుడు నిత్య చైతన్య శక్తి : చంద్రబాబు

SMTV Desk 2018-01-28 13:25:14  cm chandrababu, ap ambassador, sun, amaravati

అమరావతి, జనవరి 28 : "ఆంధ్రప్రదేశ్ కు బ్రాండ్ అంబాసిడర్ సూర్యుడు" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఉదయం సూర్యారాధన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అన్ని మతాల్లో సూర్యుడికి ఒకే ప్రాధాన్యత ఉందన్నారు. వనం-మనం, జలసిరికి హారతి అనే కార్యక్రమాలలో భాగంగానే ఈ సూర్యారాధన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సూర్యకాంతి వలన ఎన్నో అనారోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, సూర్యుడు నిత్య చైతన్య శక్తి అని వ్యాఖ్యానించారు.