ఎరిక్‌సన్‌ సంస్థతో మంత్రి కేటీఆర్ భేటీ..

SMTV Desk 2018-01-26 17:48:37  IT MINISTER KTR, Erik Ekudden, Group CTO

న్యూఢిల్లీ, జనవరి 26 : ఐటీ శాఖల మంత్రి కేటీఆర్.. అంతర్జాతీయ కంపెనీల అధిపతులతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా ఎరిక్‌సన్ గ్రూపు సీటీవో ఎరిక్ ఎకుడెన్‌తో సమావేశమైన ఆయన.. ఎలక్ట్రానిక్స్ ఉత్పుత్తుల రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎలా ప్రోత్సహిస్తుందన్న అంశాలను ఎరిక్‌సన్ సంస్థకు తెలియజేశారు. ఈ క్రమంలో.. రాష్ర్టాన్ని సందర్శించాలని ఎరిక్‌సన్ కంపెనీని మంత్రి ఆహ్వానించారు. అంతేకాకుండా ఉత్పత్తుల తయారీకి తెలంగాణ రాష్ర్టాన్ని వాడుకోవాలని సంస్థను కోరారు. స్వీడన్‌కు చెందిన ఎరిక్‌సన్ సంస్థకు.. నెట్‌వర్క్, టెలికమ్యూనికేషన్స్‌లో ప్రత్యేక గుర్తింపు ఉన్నది.