శివసేన చిత్తుగా ఓడిపోతుంది : ఫడ్నవిస్‌

SMTV Desk 2018-01-26 15:02:49  bjp, sivasena party, Devendra Fadnavis, maharastra cm,

ముంబై, జనవరి 26 : బీజేపీ పార్టీతో దాదాపు మూడు సంవత్సరాలుగా సాగుతున్న మైత్రీకి శివసేన పార్టీ రాంరాం చెప్పింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగానే పోరుకు సిద్ధమవుతుంది. కాగా ఈ విషయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ స్పందించారు. శివసేన గనుక అలా చేస్తే బీజేపీ కంటే దారుణంగా ఓటమి చవిచూస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫడ్నవిస్‌ మాట్లాడుతూ... ‘‘2019 లోక్‌ సభ ఎన్నికల్లో ఒంటరి పోరు తప్పదని శివ సేన మమల్ని (బీజేపీ) బెదిరిస్తుంది. కానీ, వాళ్లు అలా చెయ్యరనే మేము అనుకుంటున్నాం. మేం ఓడిపోతే ఓడిపోవచ్చు. కానీ, బీజేపీతో పోలిస్తే చిత్తుగా ఓటమి పాలయ్యేది మాత్రం శివ సేననే. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లే” అని వెల్లడించారు.