పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు..

SMTV Desk 2018-01-26 11:45:25  secundrabad, pared grounds, governor narasimhan, kcr.

హైదరాబాద్, జనవరి 26 : దేశమంతటా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రజలందరికి 69వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో అమర వీరులను, త్యాగమూర్తులను స్మరించుకోవడం మన విధి అని పేర్కొన్నారు. వీరి ఆశయ సాధన కోసం మనమందరం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పరేడ్ గ్రౌండ్ లో గవర్నర్ త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.