ఏపీని ఓ ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి : చంద్రబాబు

SMTV Desk 2018-01-25 19:23:15  tech mahindra, amaravathi, chandrababu naidu, davos.

హైదరాబాద్, జనవరి 25 : అమరావతిలో పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో సహకరించాలని మహీంద్రా గ్రూపు పారిశ్రామిక వేత్తలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. దావోస్‌లో మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్‌ మహీంద్రాతో భేటీ అయిన ఆయన.. ఏపీలో మహేంద్ర గ్రూప్ మరింత శక్తిమంతంగా తన ఉనికిని చాటి వ్యాపార, సేవా కార్యక్రమాలను విస్తరించాలని కోరారు. రాజధాని అమరావతి నిర్మాణం, ప్రణాళికలో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. ఈ సందర్బంగా "మీ విజన్ ఏమిటి" అని చంద్రబాబును ఆనంద్ మహీంద్రా ప్రశ్నించగా.. ఏపీని ఓ ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమేనని సమాధానం ఇచ్చారు. దానికి ఆయన సమయస్ఫూర్తితో.. భారత్‌కు ఆదర్శంగా కాదా? ప్రశ్నించగా.. అందుకు ముఖ్యమంత్రి స్పందిస్తూ మూడు నాలుగేళ్లలో భారత్‌కు ఆదర్శంగా రూపొందిస్తామని వెల్లడించారు.