త్వరలోనే వరంగల్ కు టెక్‌ మహీంద్రా..!

SMTV Desk 2018-01-25 18:51:48  IT Minister KTR, davos meeting, tech mahendra group, warangal.

దావోస్, జనవరి 25 : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల వేటలో భాగంగా టెక్‌ మహీంద్రా అధినేత ఆనంద్‌ మహీంద్రాను, ఆ సంస్థ సీఈవో సీపీ గుర్నానీ కలిసి తెలంగాణలో పరిశ్రమను స్థాపించాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన ఆనంద్‌ మహీంద్రా.. త్వరలోనే వరంగల్ లో టెక్‌ మహీంద్రా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌.. ఆనందం వ్యక్తం చేస్తూఆనంద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.