మహారాష్ట్ర సిఎం ఫడ్నివిస్ కు తప్పిన ప్రమాదం

SMTV Desk 2017-05-29 11:17:12  fadnivise,cm maharastra,save helecopter accident

ముంబాయి, మే 27 : మరో హెలికాప్టర్ ప్రమాదం తృటిలో తప్పింది.. ఈ ప్రమాదం నుండి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివిస్ తృటి లో బయటపడ్డారు. ఈ విషయం ఆయన చేసిన ట్వీట్ ద్వారానే ప్రపంచానికి తెలిసింది. "మా హెలికాప్టర్ లాతూర్ లో ప్రమాదానికి గురై క్రాష్ ల్యాండ్ అయింది. అయితే నేను, మా బృందం సురక్షితంగా ఉన్నాం, ఆందోళన పడాల్సిన అవసరం లేదని" ట్విటర్ ద్వారా ఆయన స్పష్టం చేశారు. ఆయన ప్రయాణిస్తున్న చాపర్ ను లాతూర్ సమీపంలోని నిలంగలో రహదారిపైనే క్రాష్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.