కీలక అడుగు వేసిన ‘డ్రాగన్’ దేశం..

SMTV Desk 2018-01-25 17:17:07  bullet train, china, Guangzhou, chongqing

చోంగ్‌క్వింగ్‌, జనవరి 25 : ఆగ్నేయ చైనాలో డ్రాగన్ దేశం కీలక అడుగు వేసింది. ఆగ్నేయ చైనాలోని ముఖ్య ప్రాంతాలైన చోంగ్‌క్వింగ్‌, గుజౌ ప్రావిన్సు రాజధాని గుయాంగ్‌ల మధ్య తొలి బుల్లెట్‌ రైలును చైనా గురువారం ఆరంభించింది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ సర్వీసు వల్ల చోంగ్‌క్వింగ్‌, గుయాంగ్‌ల మధ్య ప్రయాణ వ్యవధి పది గంటల నుంచి రెండు గంటలకు తగ్గింది. ఆగ్నేయ చైనాలోని మరో ప్రముఖ నగరమైన చెంగ్డూ నుంచి గుయాంగ్‌ మధ్య కూడా హైస్పీడ్‌ రైలు సర్వీసును చైనాప్రారంభించింది. ఈ మార్గంలో కేవలం మూడున్నర గంటల్లో చెంగ్డూ నుంచి గుయాంగ్‌ చేరుకోవచ్చు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన బుల్లెట్‌ రైలు ‘ఫక్సింగ్‌’ కూడా చైనాదే. ఈ ట్రైన్ షాంఘై నుండి బీజింగ్ కు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.