వర్మకు నోటీసులు..

SMTV Desk 2018-01-25 16:24:07  rgv, god sex and truth, petition, writer jayakumar

హైదరాబాద్, జనవరి 26 : వివాదాల దర్శకుడు వర్మ ప్రస్తుతం తెరకెక్కించిన ‘గాడ్, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ ఎక్కడ చూసిన ఫుల్ హల్ చల్ చేస్తుంది. ముఖ్యంగా మహిళా సంఘాలు ఈ లఘు చిత్రంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కాగా ఈ చిత్ర కాన్సెప్ట్‌ తనదని.. దాన్ని వర్మ కాపీ కొట్టారని పి.జయకుమార్‌ అనే రచయిత కోర్టులో పిటిషన్‌ వేశారు. 2015 ఏప్రిల్‌ 1న ఈ స్క్రిప్ట్‌ను తాను వర్మకు పంపానని కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని జయకుమార్‌ వెల్లడించారు. ఇటీవల విడుదలైన ‘గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’ ట్రైలర్‌ తాను రాసిన స్క్రిప్ట్‌ మాదిరిగా ఉందని తెలిపారు. జనవరి 26న ఈ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు ఆర్జీవీ ప్రకటించిన విషయం తెలిసిందే.