సీఎం కుర్చీలో బాలకృష్ణ..

SMTV Desk 2018-01-25 12:25:01  MLA balakrishna, seat matter, cm chandrababu, amaravathi.

అమరావతి, జనవరి 25 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ సాక్షాత్తు సీఎం కుర్చీలో ఆసీనులై అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. మంత్రి దేవినేని ఉమ సహా పలు జిల్లా అధికారిక యంత్రాంగంతో లేపాక్షి ఉత్సవ కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన సీఎం కుర్చీలో కూర్చోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక ఎమ్మెల్యే స్థాయి సమీక్ష నిర్వహణ నిమిత్తం బాలయ్య అలా ముఖ్యమంత్రి స్థానంలో కుర్చీలో కూర్చోవడం సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడకొచ్చిన పలువురు అధికారులు విస్తుపోయారు.