మోడల్ విలేజ్‌కు మంత్రి భూమి పూజ..

SMTV Desk 2018-01-24 14:59:12  MODAL VILLAGE, MINISTER HARISH RAO, LAND SETTLEMENT.

సిద్ధిపేట, జనవరి 24 : రిజర్వాయర్ల కింద ముంపునకు గురవుతున్న గ్రామాల పునర్నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అనంతగిరి రిజర్వాయర్ ముంపు గ్రామం కొచ్చగుట్టపల్లికి, సిద్దిపేట అర్బన్ మండలం లింగారెడ్డిపల్లి పరిధిలో "మోడల్ విలేజ్" నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మంత్రి హరీష్ రావు ఈ మోడల్ విలేజ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 12 ఎకరాల స్థలంలో 150 కుటుంబాలకు పునరావాసం కల్పించనుండగా ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం 250 గజాల స్థలంలో ఒక్కో ఇంటిని నిర్మించి ఇవ్వనుంది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. "గ్రామస్తుల తీర్మానం మేరకే ఊరి పేరును నిర్ణయిస్తామన్నారు. అలాగే అనంతగిరి రిజర్వాయర్ కింద 30 వేల ఎకరాలకు నీరందుతుందన్నారు. దసరా లోపు ఇళ్లను నిర్మించి ఇస్తామని తెలిపారు.