లాలూకి మరో షాక్..

SMTV Desk 2018-01-24 14:37:49  lalu yadav, fodder scam, ranchi, cbi court

రాంచీ, జనవరి 24 : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు మరో షాక్ తగిలింది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మూడో కేసులోనూ దోషిగా తేల్చింది. చైబాసా ట్రెజరీ అవకతవకల కేసులో లాలూతో పాటు బిహార్‌ మాజీ సీఎం జగన్నాథ మిశ్రాను రాంచీలోని సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించింది. వీరికి శిక్షను రేపు కోర్టు ఖరారు చేయనుంది. ఇదే దాణా స్కామ్‌కు సంబంధించి రెండు కేసుల్లో లాలూ దోషిగా మూడున్నరేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. జగన్నాథ్ మిశ్రా దోషిగా తేలడం మాత్రం ఇదే తొలిసారి. లాలూ ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముండా జైల్లో ఉన్నారు.