పవన్ పై విజయశాంతి విమర్శలు...

SMTV Desk 2018-01-23 17:26:40  vijayashanthi comments on pawan kalyan, cm kcr.

హైదరాబాద్, జనవరి 23 : పవన్ కళ్యాణ్ ప్రజా యాత్రపై పలు రాజకీయ పార్టీల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పవన్ యాత్రపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. "సకల జనుల సమ్మె సమయంలో పవన్‌ను టూరిస్ట్ అని కామెంట్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు పవన్‌కు తెలంగాణలో పర్యటించేందుకు వీసా ఎలా జారీ చేశారు" అంటూ ప్రశ్నించారు. అలాంటి టూరిస్ట్ నేతకు స్వేచ్ఛ కల్పించిన ప్రభుత్వం.. ఉద్యమ నేతలకు ఇవ్వకపోవడం బాధకరమని తెలిపారు.