పవన్ బస చేసిన హోటల్ వద్ద ఉద్రిక్తత..!

SMTV Desk 2018-01-23 13:26:11  pawan kalyan, karimnagar hotel, fans dispute.

కరీంనగర్, జనవరి 23 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా యాత్రలో భాగంగా కరీంనగర్ హోటల్‌ లో బస చేశారు. ఈ నేపథ్యంలో ఆ హోటల్ వద్దకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ కమంలో అభిమానుల మధ్య తోపులాట జరిగింది. పవన్ కు వ్యక్తిగత భద్రతా సిబ్బంది తక్కువగా ఉండటంతో వారు ఆ అభిమానుల తాకిడిని అడ్డుకోలేకపోయారు. దీంతో ఆ హోటల్ అద్దాలు పగిలిపోయాయి. పలువురు సిబ్బందికి గాయాలయ్యాయి. ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.