కొండగట్టుకు పవన్‌ రూ.11లక్షల విరాళం

SMTV Desk 2018-01-22 16:09:24  pawan kalyan, kondagattu, anjaneya swamy temple, 11 lakhs funds donated.

కొండగట్టు, జనవరి 22 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ దర్శించుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో కొండగట్టు చేరుకున్న పవన్‌కు ఘన స్వాగతం లభించింది. అక్కడ ఆంజనేయ స్వామికి పవన్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో కొండగట్టు ఆలయానికి ఆయన రూ.11లక్షల విరాళం ఇచ్చారు. తెలంగాణలో తాను చేపట్టే యాత్ర ప్రారంభానికి ముందుగా స్వామి దర్శనాన్ని చేసుకున్నారు. అనంతరం పవన్‌ కరీంనగర్‌ చేరుకున్నారు.