గురుకుల టీచర్ ఫలితాలు విడుదల

SMTV Desk 2017-06-22 16:39:43  gurukula Teacher post, pgt, tgt, pd, preelims, tspsc,Qualified candidates,

హైదరాబాద్, జూన్ 22 : గురుకుల టీచర్ పోస్టులైన పీజీటీ, టీజీటీ, పీడీ ప్రిలిమ్స్ ఫలితాలను టీఎస్ పీ ఎస్సీ బుధవారం రాత్రి విడుదల చేసింది. మూడు కేటగిరీల్లో 2,859 పోస్టులు ఉండగా 36,095 మందిని మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేశారు. నోటిఫికేషన్ ప్రకారం స్క్రీనింగ్ టెస్టులో నుంచి ఒక్కో పోస్టుకు 15 మంది చొప్పున ఎంపిక చేశారు. కాగా పలు క్యాటగిరీల్లో అర్హులైన అభ్యర్థులు లేని కారణంగా 7330 మంది తక్కువగా ఉన్నట్లు టీఎస్ పీ ఎస్సీ సెక్రటరీ వాణీప్రసాద్ వెల్లడించారు. ఎంపికైన వారికి జూలై 18 నుంచి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. సంస్కృతం సబ్జెక్టులో 18 పోస్టులు ఉండగా, కేవలం 47 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఉర్దూలో 196 పోస్టులకు.. 714 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక టీజీటీ ఇంగ్లీష్ కు 790 పోస్టులు ఉండగా 9127 మంది దరఖాస్తు చేశారు. సోషల్ (476 పోస్టులకు 31,623 దరఖాస్తులు), బయాలజీకల్ సైన్స్ (369 పోస్టులకు 25,938 దరఖాస్తులు) సబ్జెక్టులకు పోటీ ఎక్కువగా ఉంది. కొన్ని పీజీటీ భాషా సబ్జెక్టులకు కూడా మెయిన్స్ లో పోటీ తక్కువగానే ఉందని, ఒక్కో పోస్టుకు ఉర్దూలో 18 (71 పోస్టులకు 1324 మంది), తెలుగులో 22 (102 పోస్టులకు 23,109 మంది) చొప్పున దరఖాస్తులు వచ్చాయి. హిందీ (21 పోస్టులకు 3807 దరఖాస్తులు)లో పోటీ ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.