గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ మండిపాటు...

SMTV Desk 2018-01-22 13:04:42  CONGRESS FIRES, GOVERNOR NARASIMHAN, TRS GOVERNMENT.

హైదరాబాద్, జనవరి 22 : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌పై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమం, అవినీతిలో కూరుకుపోయిన తెరాస ప్రభుత్వానికి గవర్నర్ వత్తాసు పలుకుతున్నారని, తన హోదాను, పదవిని మరచిపోయి మాట్లాడడం సరికాదంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, సీనియర్‌ నేత వీహెచ్, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఆరోపించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని, మంత్రి హరీష్‌రావును కాళేశ్వరరావు అంటూ అభివర్ణించడ౦ చూస్తుంటే రేపు రాజ్‌భవన్‌ను కూడా "తెరాస భవన్‌" అంటారేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.