త్వరలో నిరుద్యోగ భృతికి శ్రీకారం : చంద్రబాబు

SMTV Desk 2018-01-21 15:00:00  chandrababu naidu, polavaram project, tdp leaders.

అమరావతి, జనవరి 21 : త్వరలో అన్న క్యాంటీన్లు, నిరుద్యోగ భృతికి శ్రీకారం చుడతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉండవల్లిలోని తన నివాసం వద్ద తెదేపా కార్యశాలను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్ర భవిష్యత్తు, ముఖచిత్రం, రూపురేఖలు మారనున్నాయని వ్యాఖ్యానించారు. అలాగే నీటిని శుద్ధి చేసి ఇంటింటికి అందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. ఈ మేరకు ప్రజలతో మమేకమై వారిని మెప్పించే విధంగా పార్టీ నాయకుల ప్రవర్తన ఉండాలని హితబోధ చేశారు. ఈ కార్యక్రమ౦లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.