మీ ముందుకు వస్తున్నా.. నన్ను ఆశీర్వదించండి : పవన్

SMTV Desk 2018-01-21 11:05:15  janasena party, pawan kalyan, twitter, kondagattu.

అమరావతి, జనవరి 21 : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రను తెలంగాణ రాష్ట్రం నుండి ప్రయాణించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో.. "నా అప్రహిత రాజకీయ యాత్రను తెలుగు నేలపై పుణ్య స్థలమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభించనున్నాను. 2009 ఎన్నికలకు ప్రచారం చేస్తున్న తరుణంలో సంభవించిన పెను ప్రమాదం నుండి నేను ఇక్కడే క్షేమంగా బయటపడ్డాను. దానికి తోడు మా కుటుంబ ఇలవేల్పు ఆంజనేయ స్వామి కావడంతో ఇక్కడి నుండే నా నిరంతర రాజకీయ యాత్రను ఆరభించడానికి సిద్దపడ్డాను. సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం, సమస్యలను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడానికి ఈ యాత్ర ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నా పర్యటన ప్రణాళికను కొండగట్టులో నుండి ప్రకటిస్తాను. నన్ను ఆశీర్వదించండి" అంటూ ట్వీట్ చేశాడు.