వేగానికి కళ్ళెం వేసే లేజర్ గన్ లు.. చిమ్మచీకట్లోను నిర్ద్యేశిత లక్ష్యం

SMTV Desk 2017-05-29 11:14:03  leaser guns,speed limite leaser guns,hyderabad city

హైదరాబాద్, మే 28 : భాగ్యనగరంలో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పోలిసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. లేజర్ గన్ లతో వాహానాల వేగానికి కళ్ళెం వేయనున్నారు. గంటకు వంద కిలోమిటర్లకు పైగా వేగంతో దూసుకెళ్ళే వాహన చోదకులను గుర్తించి, శిక్షించేందుకు స్పీడ్ లేజర్ గన్ లను పోలిస్ శాఖ సమకూర్చుకోనుంది. మితిమిరిన వేగంతో వెళ్ళి ప్రమాదాలకు కారణం అవుతున్న వారిని గుర్తించి జరిమానాలు వడ్డించేందుకు వాటిని వినియోగించనున్నారు. ఆ విధంగా వేగాన్ని అదుపుచేయడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చునని పోలిసులు బావిస్తున్నారు. ప్రస్తుతం జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, నెక్లస్ రోడ్ లలో వాటిని ప్రస్తుతం వినియోగిస్తున్నారు. కొత్తగా కోనుగోలుచేసే వాటితో కలిపి మెుత్తం 12 చోట్ల అతి వేగాన్ని నియంత్రించేందుకు... వాహనాలకు కళ్ళెం వేసేందుకు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి వాహనాలను నడిపే వాహన చోదకులపై వెంటనే చార్జిషిట్ దాఖలు చేయడం జరుగుతుందని పోలిసులు వెల్లడిస్తున్నారు. అందుకు అనుగుణంగా సర్వర్ ను అనుసంధానించడం జరిగినట్లు పోలిసుల ద్వారా తెలిసింది.