మోత్కుపల్లి వ్యాఖ్యలపై చర్చించిన టీడీపీ నేతలు..

SMTV Desk 2018-01-20 14:38:09  tdp leader, mothkupalli narsimhulu, ntr trust bhavan.

హైదరాబాద్, జనవరి 20 : తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఇటీవల తెదేపాను తెరాసలో విలీనం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్‌ నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ముఖ్యంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తెదేపాను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నామా నాగేశ్వర‌రావు, గరికపాటి మోహన్ రావు తదితరులు హాజరయ్యారు.