అగ్ర‌రాజ్యాన్ని దాటేసిన భార‌త్‌...

SMTV Desk 2018-01-19 15:40:26  india, america, chaina, whatsup

న్యూఢిల్లీ, జనవరి 19: భారతదేశం అగ్ర‌రాజ్య౦ అమెరికాను దాటేసింది. ఎందులో అంటే.. మొబైల్ యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకొనే దేశాల్లో భార‌త్ రెండోస్థానంలో నిలిచింది. ఇటీవల యాప్ ఆనీ అనే కంపెనీ యాప్ డౌన్‌లోడ్ల పై ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్ర‌కారం మొద‌టి స్థానంలో చైనా, రెండవ స్థానంలో భార‌త్, మూడవ స్థానంలో అమెరికా ఉంది. గతేడాది మన దేశంలో యాప్‌ల వినియోగం 215 శాత౦ పెరగగా, సగటున భారతీయులు నెలకు 40 కంటే ఎక్కువగా యాప్‌లను వినియోగిస్తున్నారని ఈ నివేదికలో తేలింది. ఇందులో ముఖ్యంగా ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకొనే యాప్ లలో వాట్సాప్‌ తొలిస్థానంలో ఉండ‌డ౦ విశేషం. అనంతరం ఫేస్‌బుక్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, ట్రూకాలర్‌, షేర్‌ఇట్‌, ఎంఎక్స్‌ ప్లేయర్‌, యూసీ బ్రౌజర్‌, అమేజాన్‌, పేటీఎం, ఇన్‌స్టాగ్రామ్‌లు వాటి తదితర స్థానాల్లో ఉన్నాయి.