ఫిబ్రవరిలో 2.5 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు

SMTV Desk 2018-01-19 14:55:15  ap cm chandrababu naidu collectors meeting

అమరావతి, జనవరి 19 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో రెండో రోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖమంత్రి చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...18 లక్షల ఇళ్ళను వచ్చే ఏడాది జనవరిలోపు పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖను ఆదేశించారు. ఇప్పటివరకు 1,88,559 (94%) ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ మేరకు కేంద్రం నుంచి మరిన్ని ఇళ్లను సాధించాల్సి ఉందన్నారు. కాగా, ఫిబ్రవరి మొదటి వారంలో 2.5 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు చేద్దామని వ్యాఖ్యానించారు. మరో విడత గృహ ప్రవేశాలు అక్టోబర్‌లో నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.