సైనికులకు అంకిత౦ "సైనిక" : అల్లు అర్జున్

SMTV Desk 2018-01-19 14:12:09  allu arjun, na peru surya na illu india, movie, sainika song, release on jan 26

హైదరాబాద్, జనవరి 19 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" చిత్రానికి సంబంధించి ఇటీవల ఫస్ట్ ఇంపాక్ట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. దేశభక్తి నేపథ్యంలో రానున్న ఈ సినిమా ఇంపాక్ట్ కు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. కాగా ఈ సినిమాలోని "సైనిక" అనే పాటను సైనికులకు అంకితమిస్తూ జనవరి 26న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్‌ని అల్లు అర్జున్ తన ట్విట్టర్ లో విడుదల చేశారు. వ‌క్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి లగడపాటి శ్రీధర్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటిస్తున్నాడు. బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ చిత్రంలో ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ అభిమానులని ఎంత‌గానో ఆకట్టుకుంటాయని టాలీవుడ్ సమాచారం.