సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్

SMTV Desk 2018-01-19 13:00:21  YS Jagan attended the CBI court, hyderabad

హైదరాబాద్, జనవరి 19 : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్న జగన్ ఈ నెల 18న, సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. అక్రమాస్తుల కేసు విచారణ మేరకు ఈ రోజు ఉదయం కోర్టుకు హాజరైన ఆయన అనంతరం తిరిగి చిత్తూరు చేరుకుని పాదయాత్రలో పాల్గొననున్నారు.