ఆరు నెలల పాటు ట్రాఫిక్ నిషేధం..!

SMTV Desk 2018-01-18 12:44:18  traffic divert issue, charminar, police commissioner srinivasarao.

హైదరాబాద్, జనవరి 18 : చార్మినార్‌ పరిసరాల్లో 6 నెలల పాటు ట్రాఫిక్‌ను నిషేధి౦చనున్నారు. పెడస్ట్రియన్‌ ప్రాజెక్టు పనుల కారణంగా ఈ దారులను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు ఇన్‌ఛార్జి పోలీస్‌ కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు. చార్మినార్‌ ద్వారా వెళ్లే వాహనాల కోసం పోలీసులు ప్రత్యామ్నాయ దారులు ఏర్పాటు చేశారు. * మదీనా నుండి చార్మినార్‌ ద్వారా వెళ్లే వాహనాలు గుల్జార్‌హౌస్‌ నుంచి షేర్‌ ఎ బాతిల్‌ కమాన్‌ లేదా ఘాన్సీబజార్‌ వైపునకు మళ్లి౦చనున్నారు. * అలీజాకోట్ల వైపు నుండి వచ్చే వాహనాలకు సర్దార్‌మహల్‌ వైపు నుండి కాకుండా చౌక్‌మెదాన్‌ ఖాన్‌ నుంచి హాఫిజ్‌ డంకా మసీదు, మొగల్‌పురా వాటర్‌ ట్యాంకు వైపు మళ్లాల్సి ఉంటుంది. * మోతిగల్లి, చౌక్‌ వైపు దిశగా చార్మినార్‌ వరకు వచ్చే వాహనాలను మోతిగల్లి నుంచి ఖిల్వత్‌, హిమ్మత్‌పురా ద్వారా నాగులచింత, ఫలక్‌నుమా వైపు వెళ్లాల్సి ఉంటుంది. * చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా వైపు నుంచి చార్మినార్‌ వచ్చే వాహనాలను హిమ్మత్‌పురా జంక్షన్‌ నుండి కాకుండా హరిబౌలి, బేలారోడ్‌ లేదా ఖిల్వత్‌, వాల్గాహోటల్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.