విశాఖలో అంతర్జాతీయ మహిళ పారిశ్రామిక వేత్తల సదస్సు

SMTV Desk 2018-01-18 12:39:05  International women industrial conference started in vishakhapatnam

విశాఖపట్నం, జనవరి 18 : ఆవిష్కరణలు అంకుర సంస్థలు పారిశ్రామికీకరణ అంశాలపై విశాఖలో ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీయ మహిళ పారిశ్రామిక వేత్తల సదస్సు అతివల్లో సరికొత్త ఉత్సాహం నింపుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు సహా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల నుంచి వచ్చిన మహిళ పారిశ్రామికవేత్తల ప్రసంగాలు ప్రోత్సాహకరంగా సాగాయి. పారిశ్రామిక వేత్తలుగా మహిళలు రాణిస్తున్న తీరు అవకాశాలను సద్వినియోగం చేసుకునే దిశగా తీసుకోవాల్సిన చొరవను ప్రస్తావించారు. గ్రామీణ మహిళలు, చదువుకున్న యువతులు, వ్యాపార మార్గంలో రాణించాలనే తపన పడే మహిళలకు సంబంధించి అంశాల వారిగా చర్చ జరిగింది. ఈ సందర్బంగా ఒకరి అనుభవాలను మరొకరు తెలుసుకునే దిశగా ఈ సదస్సు ఎంతో ఉపయోగకరమని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. వ్యాపారవేత్తలుగా విజయవంతంగా రాణిస్తున్న వారి ఆలోచనలు, అనుభవాలు కొత్త వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వారు అన్నారు. తమ దేశాల్లోను ఈ తరహా సదస్సులు నిర్వహించాలని భావిస్తున్నట్లు విదేశీ మహిళ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తున్న విద్యార్ధినీలు, యువతులు ప్రపంచ మహిళ పారిశ్రామికవేత్తల సదస్సులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యాపారం, పరిశ్రమల నిర్వహణ అంశాలపై అవగాహన కలిగేందుకు ఇదో మంచి వేదికని వారు అభిప్రాయపడ్డారు.