అనాథలకు 1 శాతం రిజర్వేషన్..!

SMTV Desk 2018-01-18 12:24:11  maharastra government, Womens Child Welfare Minister Pankaja Munde,

ముంబై, జనవరి 18 : మహారాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో అనాథలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పి౦చనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వివిధ కులాల వారీగా చూస్తే రిజర్వేషన్లు 52 శాతానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అనాథలకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని మహారాష్ట్ర సర్కారు భావిస్తోంది. అసలు ఏ కులమో తెలియని వారికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని మహారాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి పంకజ ముండే పేర్కొన్నారు. మొత్తం మహారాష్ట్ర లోని ప్రభుత్వ అనాథ శరణాలయాల్లో 3,900 మంది అనాథలున్నారని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు.