పునః ప్రారంభమైన "గురజాడ" కళాక్షేత్రం

SMTV Desk 2018-01-18 11:22:28  Restarted Guarjada Kalakhetthra vishakhapatnam

విశాఖపట్నం, జనవరి 18 : సాగర నగరం విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికైన "గురజాడ" కళాక్షేత్రం పునః ప్రారంభాన్ని ఘనంగా చాటుకుంది. గతంలో హుద్ హుద్ ధాటికి దెబ్బతిన్న కళాక్షేత్రం అందంగా ముస్తాబై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైంది. ప్రత్యేక శ్రద్ధ విధానంతో బహిరంగ ఆడిటోరియంగా తీర్చి దిద్దారు. తొలి రోజే అద్భుత కార్యక్రమాలతో కళాక్షేత్రం సందడిగా మారింది. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చిన్నారులు ప్రదర్శించిన నృత్య రీతులు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి మంత్రి గంట శ్రీనివాస్ హాజరై ప్రదర్శలనీ ఆసక్తిగా తిలకించారు.