డొల్ల కంపెనీలపై కేంద్రం కొరడా..!

SMTV Desk 2018-01-17 15:39:33  fraud companies, cancel, central govt, p p choudary, 1.20 lacks

న్యూ డిల్లీ, జనవరి 17: నల్లధనంపై వివిధ రూపాలలో చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం డొల్ల కంపెనీలపై మరోసారి కొరఢా ఝుళిపించింది. ఇప్పటికే 2.26లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడంతో పాటు.. 3లక్షల మంది డైరెక్టర్లను అనర్హులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి పి.పి.చౌదరి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం అనంతరం మరో 1.20లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయా కంపెనీలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రమంత్రి అధికారులను ఆదేశించారు. ఆ కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ, అనర్హత వేటు పడిన డైరెక్టర్లు ఇతర కంపెనీల్లో పదవులు పొందేందుకు వీలు లేకుండా కేంద్రం ఇదివరకే నిర్ణయం తీసుకుంది.