భారత్ జట్టుకు రూ.7 కోట్లు

SMTV Desk 2017-06-21 19:44:27  icc champions trophy,2017, pakistan, india

లండన్, జూన్ 21 : ఇటీవల జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో పాల్గొన్న జట్ల మధ్య మ్యాచ్ లు చాలా రసవత్తరంగా జరిగాయి. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ విజేతగా నిలిచి ఈ టోర్నిని ముగించింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్న జట్లకు ఐసీసీ ప్రైజ్ మనీ అందించింది. ఈ టోర్నిలో విజేతగా నిలిచిన పాకిస్తాన్ జట్టు అత్యధికంగా రూ. 14.18 కోట్లు అందుకుంది. 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీతో పోలిస్తే ఈ సారి జట్లకు ఎక్కువ మొత్తం అందించారని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. గ్రూప్ ఎ లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు మ్యాచ్ ఆడుతున్న సమయంలో వర్షం అడ్డంకిగా మారటంతో ఈ జట్లు పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది. ఈ టోర్నిలో వరుసగా 3 విజయాలతో ఇంగ్లాండ్ ముందుగా సెమిస్ చేరుకుంది. గ్రూప్ బి లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన పోటి హోరాహోరి గా జరిగింది. ఆరంభంలో భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్థాన్ తరువాత జరిగిన మ్యాచ్ ల్లో వరుస విజయాలు సాధిస్తూ ఫైనల్ లో భారత్ పై 180 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీ విజేతగా నిలిచింది. ఈ టోర్ని ముగిసిన అనంతరం ఐసీసీ లో పాల్గొన్న 8 జట్లు ప్రైజ్ మనీ అందించారు. విన్నర్ గా నిలిచినా పాకిస్థాన్ కు రూ 14.18 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకుంది. రన్నరప్ గా నిలిచినా భారత్ కు రూ. 7 కోట్లు ఇచ్చినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ జట్లతో పాటు ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లకు 3 కోట్లు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు 58 లక్షలు, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లకు 39 లక్షల రూపాయలను అందించినట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించారు.