నేడు తిరుపతిలో పర్యటించిన సీఎం చంద్రబాబు

SMTV Desk 2018-01-13 16:28:14  ap cm chandrababu naidu thirupathi tour

తిరుపతి, జనవరి 13 : నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటించి, అక్కడి విమానాశ్రయంలో ప్రముఖులు వేచి ఉండేందుకు నిర్మించనున్న సెరిమోనియల్‌ లాంజ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ రోజు మధ్యాహ్నం తిరుపతిలో చేరుకున్న అనంతరం ఆయన ఈ కార్యక్రమానికి హజరయ్యారు. తదుపరి రేణిగుంటలో ఐటీ పరిశ్రమ జోహోను ప్రారంభించారు. అలాగే కరకంబాడీ రోడ్డులోని సరోవర్‌ హోటల్‌ వద్ద డిసిగ్నేటెడ్‌ ఐటీ హబ్‌ను ప్రారంభించనున్నారు. కాగా, పండుగ సందర్భంగా నారావారి పల్లెకు ఆయన చేరుకుంటారు. అక్కడే మూడు రోజులపాటు సంక్రాంతి వేడుకలను ఆయన జరుపుకోనున్నారు.