శవం వద్ద ... అమ్మ.. ఆకలి అంటూ రోధించిన చిన్నారి

SMTV Desk 2017-05-29 11:11:32  mother dead in raliway track,madhay pradesh

భోపాల్, మే 27 : కొన్ని కొన్ని దృశ్యాలను చూస్తే హృదయం ద్రవిస్తుంది. నోట మాట రాదు కంట కన్నీరు తప్ప, ఇలాంటి ఓ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. ఆ వీడియో చూసిన వారంతా అయ్యో పాపం.. ఎంత కష్టమొచ్చిందోనని చలించిపోతున్నారు. ఒళ్ళు గగుర్పాటుకు గురిచేసే ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో చూసిన వారిని తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ఎవరికి ఇలాంటి విపత్కార పరిస్థితులు ఎదురుకావద్దని వేడుకునే పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రదేశ్ లోని దామోహ్ లో రైలుపట్టాలపై ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు పట్టాలపై పడి ఉన్న వివాహిత మృతదేహం.. ఆ పక్కనే ఏడుస్తున్న సంవత్సరం చిన్నారి, చనిపోయిన తల్లిని కదుపుతున్నాడు.. నిద్రలో ఉన్న తన తల్లి లేచి పాలు ఇవ్వాలని కాబోలు... అది ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారి హృదయాలను ద్రవింపచేసింది.. ఆకలితో ఏడ్చి ఏడ్చి అలమటిస్తుండడంతో ఆ పరిసర ప్రాంతాల వారు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి అడ్మిషన్ ఫీజు ఎవరు కట్టేందుకు సిద్దం కాక పోవడంతో బిడ్డను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి అధికారులు నిరాకరించారు. చివరకు వార్డు బాయ్ ఉదారతతో బిడ్డకు వైద్యం అందించారు. శిశుసంరక్షణా కేంద్రానికి చిన్నారిని తరలించారు. ఘటనా స్థలంలో దొరికిన పర్స్ అధారంగా కేసు విచారణ నిర్వహిస్తున్నారు.