నగరంలో ప్రయాణ ప్రాంతాల కిటకిట...

SMTV Desk 2018-01-12 12:32:46  RTC Special buses in telugu states, sankranthi festivel

హైదరాబాద్, జనవరి 12 : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు వారివారి సొంతుర్లకు వెళ్లుతున్నారు. పెద్ద ఎత్తున జనం రావడంతో ప్రయాణ ప్రాంగణాలు జన జాతరను తలపిస్తున్నాయి. పండుగ వేళ సొంత్తూరుకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద పెద్ద సంచులతో తోపులాటల మధ్య ప్రయాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రయాణ ప్రాంతాలు కిటకిటలాడుతూన్నాయి. పాఠశాలలు, కళాశాలకు పండుగ సెలవులు ప్రకటించడంతో, కుటుంబాలు ఇంటి దారి పట్టాయి. ముఖ్యంగా పండుగకు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు వెళ్లే వారు ఎక్కువగా ఉండటంతో, ఆర్టీసీ బస్సులు బయలుదేరే సంజీవిని నగర్, అమీర్ పేట్, ఎల్బీనగర్ ప్రాంతాలు రద్దీగా మారాయి. ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్న రద్దీకి అవి ఏ మాత్రం సరిపోవడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ప్రయాణికులతో ఖమ్మం బస్టాండ్ రద్దీగా మారింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో నిండిపోయింది. ఉద్యోగులు, విద్యార్ధులు సొంత్తూర్లకు బయలుదేరడంతో బస్సులన్నీ నిండిపోతున్నాయి. ప్రత్యేకంగా పెట్టిన బస్సులు సరిపోక, ప్రయాణికులు గంటలపాటు ఎదురు చూడాల్సి వస్తుంది. యదాద్రి, భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజాలో క్రమంగా రద్దీ పెరుగుతుంది. మరో రెండు రోజులు మరింత రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.