ఈ నెల 12న ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ ఖరారు

SMTV Desk 2018-01-11 12:19:08  India prime minister naredra modi, ap cm chandrababu naidu meeting on 12th

అమరావతి, జనవరి 11 : ఈ నెల 12న భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటి కావడానికి ప్రధాని కార్యాలయం నుంచి అధికారికంగా పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో నేడు రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరనున్నారు. నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూ లోటు, పోలవరంపై సీఎంల సమావేశం, విభజన చట్టంలోని అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు అపాయింట్‌మెంట్‌ను రాష్ట్ర్త సీఎంవోకు ప్రధాని కార్యాలయ అధికారులు ఖరారు చేసినట్లు తెలియజేయడం జరిగింది.