టీఆర్‌టీ ఎడిట్‌ ప్రక్రియలో గందరగోళం..!

SMTV Desk 2018-01-10 18:26:28  TRT notification, Editing options, state government.

హైదరాబాద్, జనవరి 10 : ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) దరఖాస్తులలో తప్పులను సవరించుకునేలా ప్రభుత్వం 8 నుంచి 11వ తేదీ వరకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎడిట్‌ ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. కేవలం ఒక దరఖాస్తును మాత్రమే సవరించుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించడంతో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులను ఎడిట్‌ చేసుకునే వారిని తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌టీలో అన్ని దరఖాస్తులను సవరించుకొనేలా అవకాశం కల్పించాలంటూ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.