భారీగా పెరిగిన ఫ్లాట్ ఫాం టిక్కెట్ ధరలు

SMTV Desk 2018-01-10 16:55:08  Railway tickets, flatform tickets increase, amaravathi.

అమరావతి, జనవరి 10 : సంక్రాంతి పర్వదిన౦ సందర్భంగా ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధరలను భారీగా పెంచారు. ప్రస్తుతం రూ.10 ఉన్న టిక్కెట్‌ ధరను రూ.20 లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ ధరలు ఏపీలోని విజయవాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు రైల్వే స్టేషన్‌లలో పెంచుతున్నారు. అలాగే ఇటీవల సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కూడా ప్లాట్‌ఫారం టిక్కెట్ ధరను రూ.10 నుంచి 20లకు పెంచుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. కాగా పెరిగిన ధరలు ఈ నెల 11 నుంచి 17 వరకు అమలు కానున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.