కాకినాడలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏపీ సీఎం

SMTV Desk 2018-01-10 16:27:58  Statue of NTR Unveiled ap cm chandrababu naidu,

తూర్పుగోదావరి, జనవరి 10 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి-నా ఊరు కార్యక్రమంలో భాగంగా నేడు కాకినాడలో పర్యటించారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయ భవనాన్ని, ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... రానున్న ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ కార్యాలయం వేదిక కావాలని అన్నారు. పార్టీ కార్యాలయానికి వెళితే, తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్నా భావన ప్రజల్లో రావాలని ఆయన వెల్లడించారు. కాగా, జన్మభూమి కార్యక్రమాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికే ముందుకు తీసుకొచ్చామని ఆయన తెలిపారు.