డిసెంబర్ లో గణనీయంగా పెరిగిన డిజిటల్ లావాదేవీలు...

SMTV Desk 2018-01-10 16:17:52  DIGITAL TRANSCATIONS, UPI, RBI STASTICS, DECEMBER, BILLION MARK,

బెంగుళూరు, జనవరి 10 : పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజలు డిజిటల్ లావాదేవీలపై అవగాహన పెంచుకోవడంతో క్రమేణా వాటి వాడకం జోరందుకుంది. ఇటీవల జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ప్రభుత్వం వెల్లడించిన అధికారక సమాచారం ప్రకారం 2016 నవంబర్ లో నమోదైన డిజిటల్ చెల్లింపుల సంఖ్య 91 కోట్లు. 2017 అక్టోబర్ కు ఇవి 153 కోట్లకు విస్తరించాయి. కాగా గతేడాది డిసెంబర్ నెలలో జరిగిన డిజిటల్‌ లావాదేవీలు బిలియన్‌ మార్కును దాటాయని భారత రిజర్వు బ్యాంకు తెలిపింది. ఆర్బీఐ ప్రకటించిన వివరాల ప్రకారం డిసెంబరు నెలలో 1.06 బిలియన్ల ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిగాయి. నవంబరు నెలతో పోలిస్తే లావాదేవీల సంఖ్య 6.5శాతం పెరిగిందని, యునిఫైడ్‌ పేమెంట్స్‌, ఐఎంపీఎస్‌, కార్డ్స్‌, వాలెట్స్‌ నుంచి లావాదేవీల సంఖ్య ఎక్కువగా ఉందని భారత రిజర్వు బ్యాంకు వెల్లడించింది. ముఖ్యంగా యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ పేస్‌) పేమెంట్స్‌లో 40 శాతం వృద్ధి ఉన్నట్లు ఆర్బీఐ వివరించింది.