నగరంలో ఆర్టీసీ సిబ్బంది కొరత

SMTV Desk 2018-01-10 15:18:22  RTC Shortage of staff in the city, RTC is a statement of ND Ramana Rao

హైదరాబాద్, జనవరి 10 : తెలంగాణ రాష్ట్ర రాజధానిలో గ్రేటర్‌ ఆర్టీసీలో సిబ్బంది కొరత సమస్యలు తల్లెత్తుతున్నాయి. ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం...నగరంలో మొత్తం 29 డిపోలు, 3850 ఆర్టీసీ బస్సులున్నాయి. అందులో ఖాళీగా ఉన్న డ్రైవర్‌, కండక్టర్‌ ఉద్యోగాలకు తోడు ప్రతి డిపోలో రోజుకు సుమారు 10-15 మంది కండక్టర్లు, డ్రైవర్లు అకస్మాత్తుగా సెలవులు పెడుతుండటంతో, కొన్ని బస్సులు డిపోలకే పరిమితమవుతున్నాయి. దీంతో సిబ్బంది పరిస్థితి ఎలా ఉన్నా ఆర్టీసీ ప్రగతి చక్రాలను ముందుకు నడిపించే డ్రైవర్లు, కండక్టర్ల కొరత ఏర్పడిందని ఆర్టీసీ కార్మికులు తెలిపారు. ఈ మేరకు సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ బహుజన కార్మి క యూనియన్‌ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్‌ డిమాండ్‌ చేస్తూ, మంగళవారం ఆర్టీసీ ఎండీ రమణరావుకు వినతిపత్రం అందజేశారు.