డిజిటల్ వెరిఫికేషన్‌లో తెలంగాణకు ప్రశంసలు..!

SMTV Desk 2018-01-10 14:37:35  minister sushma swaraj, congratulate telangana, it minister ktr, non residency meetings,

న్యూఢిల్లీ, జనవరి 10 : డిజిటల్ వెరిఫికేషన్‌కు సంబంధించి ఇ-సనత్ అమలులో తెలంగాణ రాష్ట్రం ముందుందని కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ప్రశంసల వర్షం కురిపించారని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో ప్రవాసీ భారత్ (పీఐవో) సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాస్‌పోర్టు విచారణ, ఇమ్మిగ్రేషన్‌లో తెలంగాణ ముందుందని కేంద్రమంత్రి అన్నారని పేర్కొన్నారు. ఈ పీఐవో చర్చల్లో భాగంగా విదేశాల్లో భారతీయులు పడుతున్న ఇబ్బందులపై ప్రధానంగా చర్చించామన్నారు. ఒకవేళ విదేశాల్లో ఉండి తప్పులు చేసి చిక్కిపోయి, మళ్ళీ మళ్ళీ తప్పులకు పాల్పడితే వారి పాస్‌పోర్టు రద్దు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం అంటూ కేటీఆర్ అన్నారు.