కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

SMTV Desk 2018-01-10 12:01:50  ap cm chandrababu naidu Krishna District collector congratulated Lakshmikantam

విజయవాడ, జనవరి 10 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఏపీలోనే కృష్ణా జిల్లాకు ఐఎస్‌వో 9001 సర్టిఫికేషన్ సాధించిన ఘనత దక్కించుకున్నందున కృష్ణా జిల్లా కలెక్టర్ ను రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...కృష్ణా జిల్లా స్ఫూర్తితో అన్ని కలెక్టరేట్లలో ప్రమాణాలు పెరగాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం, ప్రజా సంతృప్తిలో కృష్ణా జిల్లా ముందుందని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా సేవా కేంద్రాలుగా గుర్తింపు రావాలని సీఎం అన్నారు. అలాగే 2022నాటికి దేశంలోనే ఏపీ 3వ స్థానంలో నిలవాలని, 2029నాటికి దేశంలోనే ఏపీ అగ్రగామి రాష్ట్రం కావాలని ఆయన కోరారు.