ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం

SMTV Desk 2018-01-10 11:35:13  ACB doing Tirupati SUV Varsity Assistant Engineer N. Rudrakumar Searches

తిరుపతి, జనవరి 10 : తిరుపతిలో ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. వచ్చిన ఆదాయమే కాకుండా అక్రమ ఆస్తులు కూడగట్టుకున్న తిరుపతి ఎస్వీ వర్సిటీ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ఎన్‌.రుద్రకుమార్‌ నివాసంలో ముమ్మరంగా సోదాలు నిర్వస్తున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఆరు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. ఈ మేరకు రుద్రకుమార్ పై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో ప్రాథమిక ఆధారాలు సేకరించిన అనిశా అధికారులు ఏకకాలంలో సోదాలు. చేపట్టారు. ఒక్క రుద్రకుమార్‌ నివాసంలోనే కాకుండా నెల్లూరులోని ఆయన బావమరిది ఇంట్లో అలాగే, సోదరి, సోదరుల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో పట్టుబడిన చర ,స్థిర ఆస్తులు, బంగారు, వెండి ఆభరణాల విలువలను లేక్కిస్తున్నట్లు సమాచారం.