బడ్జెట్‌కు ప్రత్యక్ష పన్నులు బూస్ట్: ఆర్థిక మంత్రిత్వ శాఖ

SMTV Desk 2018-01-09 16:03:08  direct taxes, increase, finance ministry, central govt

న్యూ డిల్లీ, జనవరి 09: కేంద్ర బడ్జెట్ ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖకు శుభ పరిణామం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయి. ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో డైరెక్ట్‌ టాక్స్‌ 18.2 శాతం పెరుగుదలను నమోదు చేసి౦దని, దీంతో ఈ వసూళ్లు రూ.6.56 లక్షల కోట్లకు చేరాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించి౦ది. ప్రత్యక్ష పన్నుల్లో ఇన్‌కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్‌తోపాటు కంపెనీలు చెల్లించే కార్పొరేట్ పన్నులు ఉంటాయి. ఇక అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు 12.7 శాతం పెరిగి రూ.3.18 లక్షల కోట్లకు చేరినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ పెరుగుదలలో కార్పొరేట్ ఇన్‌కమ్ ట్యాక్స్ వాటా 10.9 శాతం కాగా.. వ్యక్తిగత ఇన్‌కమ్ ట్యాక్స్ వాటా 21.6 శాతంగా ఉంది.