రజిని బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వ్యతిరేకిస్తాం : కాంగ్రెస్ అధ్యక్షుడు

SMTV Desk 2018-01-09 15:20:16  rahinikanth, political comments, tamil congress president, s. tirunavukkaraasar.

చెన్నై, జనవరి 9 : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ రాజకీయాలలోకి వస్తున్నట్లు ప్రకటించిన నాటి నుండి రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత రజిని బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆయనకు వ్యతిరేకంగా ఉంటామని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్‌.తిరునావుక్కరాసర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన ఇతర పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అన్నది చూడాలి. కానీ ఒకవేళ రజనీ భాజపాతో చేతులు కలిపితే మాత్రం కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తుంది" అంటూ పేర్కొన్నారు.