రేపు కోర్టుకు హాజరు కానున్న యాంకర్ ప్రదీప్..

SMTV Desk 2018-01-09 12:46:06  anchor pradeep, nampally court, drunk and drive.

హైదరాబాద్, జనవరి 9 : అతిగా మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్ ఇటీవల తన తండ్రితో కలిసి కౌన్సిలింగ్ కి హాజరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను నాంపల్లి కోర్టులో హాజరపర్చేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. నిజానికి ప్రదీప్ కోర్టుకు ఈ రోజే హాజరు కావాల్సి ఉంది. కాని అతను రేపటికి సమయం కోరడంతో దీనికి పోలీసులు అంగీకరించారు. కాగా ఆయన చేసిన తప్పుకు క్షమాపణలు చెబుతూ ఒక సేల్ఫీ వీడియో విడుదల చేసిన ప్రదీప్ తనలా మరొకరు తప్పు చేయకూడదు అని కోరారు. మరి రేపు కోర్టుకు హాజరు కానున్న ఆయనకు జైలు శిక్షా.? లేదంటే జరిమానా.? అనే విషయం చర్చనీయాంశంగా మారింది.