రాష్ట్రంలో ప్రతి రైతు ఆర్థికంగా ఎదగాలి :సీఎం చంద్రబాబు

SMTV Desk 2018-01-09 11:35:00  ap cm chandrababu naidu, janmami meeting Teleconference

అమరావతి, జనవరి 9 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 10న నిర్వహించే మెగా రుణమేళా, బ్యాంకు లింకేజి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపును ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి-నా ఊరు కార్యక్రమాన్ని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే నిర్వహించమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఆర్థిక ఇబ్బందుకు ఎదురుకాకుండా ఏడాదికి రూ. 3 లక్షల నుంచి 4 లక్షలు సంపాదించే స్థితికి రావాలని ఆశిస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రతి గ్రామానికి, వార్డుకు డెవపల్‌మెంట్‌ విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని, అందుకు 16వేల విద్యార్ధి బృందాల సేవలు వినియోగించుకోవాలన్నారు. తెలివి తేటలకు సాంకేతికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. కాగా, రేపు నిర్వహించనున్న బ్యాంకు లింకేజి కార్యక్రమానికి బ్యాంకర్లే జన్మభూమి సభలకు వచ్చి రుణమేళా నిర్వహించడం, జరుగుతుందన్నారు.