శాసన సభ్యుడికి జరిమానా విధింపు

SMTV Desk 2017-05-29 11:05:16  mla yadiah,chevella,black stickers on the car glasses

హైదరాబాద్, మే 31 : పోలీసు నిబంధనలు ఉల్లంఘించిన శాసన సభ్యుడికే జరిమానా వడ్డించి విధి నిర్వహణలో తమ చిత్తశుద్దిని చాటుకున్నారు ట్రాఫిక్ సిబ్బంది. హైదరాబాద్ నగరంలో ఈ మధ్య సర్వసాదారణంగా దర్శనం ఇస్తున్న బ్లాక్ ఫిల్మ్లపై అంతగా దృష్టిపెట్టని ట్రాఫిక్ పోలిసులు, ఏకంగా శాసన సభ్యుడు కాలే యాదయ్యనే దొరకబుచ్చుకున్నారు. సైబరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు గేటు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తగా ప్రవేశ పెడుతున్న స్పీడ్ గన్ ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సీపీ సందీప్ శాండిల్యతో పాటు పలువురు ఉన్నతాధికారులు అక్కడ ఉన్నారు. అయితే అక్కడ మీడియా, పోలిసులతో హడావుడిగా ఉండగా అక్కడకు వచ్చిన శాసన సభ్యులు కాలే యాదయ్యకు చిక్కు తప్పలేదు. ఆయన కారుకు బ్లాక్ ఫిల్మ్ అంటించి ఉండడంతో 500 జరిమానా విధించారు. శాసన సభ్యుడు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, అక్కడ మీడియా వారు ఉండడంతో ఆ డబ్బు చెల్లించక తప్పలేదు...